నా ముందు నడిచే యేసయ్యా
పల్లవి : నా ముందు నడిచే యేసయ్యా
నీవెంట నడిచెదనయ్య |2|
ధూరమైన భారమైన |2| నిన్ను
విడిచి ఉండలేనయ్య
1 . తల్లిలా లాలించావు నా తండ్రీల పాలించావు |2|
నీ ప్రేమలో నన్ను పెంచావు |2|
నిన్ను విడిచి ఉండలేనయ్యా
2 . చంకలో మోసినావు నీ ఒడిలో దాచినావు |2|
ధీర్ఘ శాంతముతో సహించావు |2|
నిన్ను విడిచి ఉండలేనయ్య
3 . చేయి పట్టి నడిపించావు నా అక్కరలు తీర్చినావు |2|
నీ వాక్కుతో బ్రతికించావు |2|
నిన్ను విడిచి ఉండలేనయ్యా
No comments:
Post a Comment