Sunday, 23 January 2022

నను చూసే యేసయ్యా వందనాలయ్యా నను నడిపే మెస్సయ్యా స్తోత్రమయ్యా తెలుగు క్రిస్టియన్ సాంగ్ లిరిక్స్ డౌన్లోడ్

 

 నన్ను చూసే యేసయ్యా వందనాలయ్యా 


పల్లవి : నను చూసే యేసయ్యా వందనాలయ్యా 

నను నడిపే మెస్సయ్యా స్తోత్రమయ్యా |2|

నీ కృపలో నీ సేవలో నను నడుపుచున్న యేసయ్యా |2|


1. నా తల్లి గర్భమందు చూచినావయ్య |2|

నీ కొరకే నను ఏర్పరచినావయ్యా |2|


2. ఎన్నిక లేని నన్ను పిలిచినావయ్యా |2|

నీ మంద నాకప్పగించినావయ్య |2|


3. మందకు మాదిరిగా జీవింతునయ్యా |2|

సీయోనులో నిన్ను దర్శింతునయ్యా |2|












నేను నా వాడను కాను నన్ను కొన్నావు నీవు తెలుగు క్రిస్టియన్ సాంగ్ లిరిక్స్ డౌన్లోడ్

                               నేను నా వాడను కాను 


పల్లవి : నేను నా వాడను కాను నన్ను కొన్నావు నీవు నేను నీ వాడను యేసయ్యా నన్ను వాడుకో యేసయ్యా |2|


1. ఈ దేహం నాది కాదు ఆరోగ్యం నాది కాదు |2|

నీవే నాకిచ్చినవేసయ్య నీవే వాడుకో యేసయ్యా |2|


2. ఈ చేతులు నాయి కావు ఈ కాళ్ళు నాయి కావు |2|

నీవే నాకిచ్చినవేసయ్య నీవే వాడుకో యేసయ్యా |2|


3. ఈ కన్నులు నాయి కావు ఈ చేవులు నాయి కావు |2|

నీవే నాకిచ్చినవేసయ్య నీవే వాడుకో యేసయ్యా |2|


4. ఈ నోరు నాది కాదు ఈ రాగం నాది కాదు |2|

నీవే నాకిచ్చినవేసయ్య నీవే వాడుకో యేసయ్యా |2|











నా బ్రతుకంతా నీకంకితం నా జీవితమంతా నీకే సొంతం తెలుగు క్రిస్టియన్ సాంగ్ లిరిక్స్



          నా బ్రతుకంతా నీకంకితం 


పల్లవి : నా బ్రతుకంతా నీకంకితం నా జీవితమంతా నీకే సొంతం |2|

ఏ దినమైన ఏ క్షణమైనా నా బ్రతుకంతా నీకంకితం |2|


1. చీకటిలో ఉన్న నన్ను వెలుగులోనికి పిలిచితివి |2|

వెలిగించబడిన నేను ఆరిపోవుట న్యాయమా |2|


2. పేరు పెట్టి పిలిచితివి నీ చేయి చాపి పట్టుకుంటివి |2|

నాగటి మీద చేయి వేసిన నే తిరిగి చూచుట ధర్మమా |2|


3. గమ్యానికి చేరాలని బహుమనాన్ని పొందాలని |2|

ఊపిరి నాలో ఉన్నంత వరకు నీ సేవలో సాగిపోదును |2|












Saturday, 22 January 2022

నీవే కావాలి యేసయ్య నాకు నీవే కావాలి యేసయ్య తెలుగు క్రిస్టియన్ సాంగ్ లిరిక్స్

 నీవే కావాలి యేసయ్యా 


పల్లవి : నీవే కావాలి యేసయ్య నాకు నీవే కావాలి యేసయ్య

నాలో నీవు నీలో నేను |2| కలిసి ఉండాలయ్య |2|

 

1 . నీవు లేని లోకము వద్దు నాకు నీవు లేని బ్రతుకు వద్దు |2|

నా తోడు నీవే నా నీడ నీవే |2| నీవే కావాలి యేసయ్య |2|

 

2 . నీవు లేని ధనము వద్దు నాకు నీవి లేని ఘనత వద్దు |2|

ఏమున్నా లేకున్నా |2| నీవే కావాలి యేసయ్య |2|

 

3 . నీవు లేని దినము వద్దు నాకు నీవు లేని క్షణము వద్దు |2|

ఎవరున్న లేకున్నా |2| నీవే కావాలి యేసయ్య |2|








నా ముందు నడిచే యేసయ్యా తెలుగు క్రిస్టియన్ సాంగ్ లిరిక్స్

నా ముందు నడిచే యేసయ్యా


పల్లవి : నా ముందు నడిచే యేసయ్యా

నీవెంట నడిచెదనయ్య |2|

ధూరమైన భారమైన |2| నిన్ను విడిచి ఉండలేనయ్య

 

1 . తల్లిలా లాలించావు నా తండ్రీల పాలించావు |2|

నీ ప్రేమలో నన్ను పెంచావు |2| నిన్ను విడిచి ఉండలేనయ్యా

 

2 . చంకలో మోసినావు నీ ఒడిలో దాచినావు |2|

ధీర్ఘ శాంతముతో సహించావు |2| నిన్ను విడిచి ఉండలేనయ్య

 

3 . చేయి పట్టి నడిపించావు నా అక్కరలు తీర్చినావు |2|

నీ వాక్కుతో బ్రతికించావు |2| నిన్ను విడిచి ఉండలేనయ్యా

 

  

Thursday, 20 January 2022

ధోకు కరుచు యేసుబా సాంగ్ లిరిక్స్ డౌన్లోడ్

ధోకు కరుచు యేసుబా 


పల్లవి : ధోకు కరుచు యేసుబా తోనజ ధోకు కరుచు |2|

  బంచన రజేతావును మహిమమ భలతావును |2|


1. మన్న పెదకిదోజకో దేవతు మార ఆంగ చాలేవాలోతు |2|


2. ఆంకీర హంసూన లూయెవాలోతు కాంకేమ పాడనా సంజాయెవాలోతు |2|


3. మార వినతిన సాంలేవాలోతు మన్న మోక్షమ లేజయేవాలోతు |2|






Monday, 17 January 2022

ఎంత ప్రేమ ఎంత ప్రేమ నాపైన యేసు నీకు నాపైన యేసు నీకు సాంగ్ లిరిక్స్

ఎంత ప్రేమ ఎంత ప్రేమ 


పల్లవి : ఎంత ప్రేమ ఎంత ప్రేమ నాపైన యేసు నీకు నాపైన యేసు నీకు |2|


1. ఏ మంచి లేని నన్ను ఏమి గతి లేని నన్ను |2|

చేరదీసినావు ప్రేమించినావు స్తుతించేదా యేసు నిన్ను |2|


2. నిందలలో నేనుండగా ఎక్కి ఎక్కి ఏడుస్తుండగా |2|

చేరదీసినావు కన్నీరు తుడిచినావు స్తుతించేదా యేసు నిన్ను |2|


3. ఆపదలో నేనుండగా నశీయించిపోతుండగా |2|

చేరదీసినావు ఆదరించినావు స్తుతించేదా యేసు నిన్ను |2|

NEW JERUSALEM CHURCH

NEW JERUSALEM CHURCH 

New Jerusalem Church Medak


 New Jerusalem Church was Established in 2005 by Pastor V Elisha gaaru. It is God worship Center in Medak. Above 200 Peoples are worship in this Church. This Church Have Another Branch in Rayeen Cheruvu vilage Chegunta. This Gospel Spred in Banjara Language and Telugu. Every Sunday Believers are came from Medak , Durga colony , Ningasanpally , Aurangabad Thanda , Ghanapur Thanda , Pillykottal Thanda and Thimmakkapally Thanda.  

     Every Friday Conducting Fasting Prayer and Every First Saturday All night Prayer and Every First Sunday is Holy Communian ( Prabhu Balla Aradhana ). Pastor V Elisha gaaru Written Somany Spirtual Songs in Telugu and Banjara Language. Somany Peoples are Healed in This Church in the name of almighty god Jesus. 

ఓ సంఘమా క్రైస్తవా సంఘమా సాంగ్ తెలుగు లిరిక్స్

 ఓ సంఘమా క్రైస్తవా సంఘమా  పల్లవి : ఓ సంఘమా క్రైస్తవా సంఘమా   ప్రభు రాకకై సిద్ధపడుమా   ఓ సంఘమా క్రైస్తవా సంఘమా   ప్రభు రాకకై సిద్ధంగుండుమా ...