Sunday, 23 April 2023

ప్రార్థించు ఓ సంఘమా ప్రార్థన మానకుమా సాంగ్ తెలుగు లిరిక్స్

 ప్రార్థించు ఓ సంఘమా ప్రార్థన మానకుమా 


పల్లవి : ప్రార్థించు ఓ సంఘమా ప్రార్థన మానకుమా 

మేల్కొని ప్రార్థించుమా కనిపెట్టి ప్రార్థించుమా |2|


  1. అపోస్తులుల త్యాగాన్ని చూడు కలిగున్న భారాన్ని చూడు |2|

మారిపోయిరి ప్రభు సాక్షిగా నిలిచిపోయిరి హత సాక్షిగా |2|


  2. నశియించే ఆత్మలను చూడు భారంతో ప్రార్థించు నీవు |2|

మారిపోవాలి ప్రభు సాక్షిగా నిలిచిపోవాలి హత సాక్షిగా |2|

దైవ దాసుల హస్తాలు ఎంతో ఆశీర్వదాలు సాంగ్ తెలుగు లిరిక్స్

దైవ దాసుల హస్తాలు ఎంతో ఆశీర్వదాలు  


పల్లవి : దైవ దాసుల హస్తాలు ఎంతో ఆశీర్వదాలు 

  ప్రభువు పంపగా వచ్చారు దీవించిపోతారు |2|


 1. అభిషేకించబడినవారు పంపబడినవారు

చేతులెత్తి ప్రార్థించగా కలుగు స్వస్థతలు |2|


  2. నీతిమంతుని చేర్చుకొని నీతి ఫలములు పొందెదరు

మంచి నీళ్ళు ఇచ్చిన ఫలాలన్నీ పొందెదరు |2|


  3. మొదటి రొట్టెనిచ్చేదను దీవెనలు పొందెదను

కరువు కాలమంతయు పోసించబడేదను |2|


  4. ప్రవక్తను చేర్చుకొని ప్రవక్త ఫలము పొందెదను 

వారికి లోబడినను ప్రవక్తగా మారెదను |2|    



యేసయ్యా నా అడుగులు లెక్కిస్తున్నావు సాంగ్ తెలుగు లిరిక్స్

 యేసయ్యా నా అడుగులు లెక్కిస్తున్నావు


పల్లవి: యేసయ్యా నా అడుగులు లెక్కిస్తున్నావు 

యేసయ్యా నా కన్నీరు తుడుస్తున్నావు |2| 


1. నీ సేవ చేయుటకు  యే యోగ్యత లేకున్నను |2|

    నీ కృపతో క్షమించి నన్ను యాజకునిగా మార్చితివా |2|


2.    నీ సేవ మార్గములో పలు  శోధనలెదురైనను |2|

నీవు నా పక్షమై ఉండగా అవి నిలువ లేకుండెనే |2|


3. సుడిగాలు లెదురొచ్చిన పెను తుఫాను చెలరేగిన |2|

నాతో వస్తున్నావు నడిపిస్తున్నావు ప్రతి స్థలములో విజయమునిస్తున్నావు |2|

Thursday, 3 November 2022

అభిషేకమిమ్ము ఆత్మరూపుడా తెలుగు సాంగ్ లిరిక్స్

 అభిషేకమిమ్ము ఆత్మరూపుడా 



పల్లవి: అభిషేకమిమ్ము ఆత్మరూపుడా శక్తితో నింపుము పరిశుద్ధాత్ముడా |2|

   మాపైకి దిగి రమ్మయ్యా నీ శక్తితో నింపుమయ్యా |2|


1. పెంతుకొస్తు దినమున అపొస్తుల మీదికి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడా |2|

   మాపైకి దిగి రమ్మయ్యా నీ శక్తితో నింపుమయ్యా |2|


2. పేతురు యోహాను వలె ధైర్యముగా నిలిచి నిన్ను ప్రకటించాలి |2|

   వేల వేల ఆత్మలను నీ సన్నిధికి నడిపించాలి |2|

 

దేవుని పిల్లలం మేము తెలుగు సాంగ్ లిరిక్స్

 దేవుని పిల్లలం మేము 


పల్లవి: దేవుని పిల్లలం మేము దేవుని పిల్లలం 

   పరలోక దేవునికి ప్రియమైన పిల్లలం |2|


1. కాము దాసులము ఎవరికి లేము బానిసులము |2|

   విలువబెట్టి కొనబడిన మేము ప్రభువుకు పిల్లలం యేసు ప్రభువుకు పిల్లలం |2|


2. చీకటి నుండి వెలుగులోనికి పిలువబడినవారము మేము పిలువబడినవారం |2|

   లోకానికి వెలుగునిచ్చే ఆరని జ్యోతులం మేము ఆరని జ్యోతులం |2|


3. పాపం నుండి విడుదలపొందిన యేసుని పిల్లలం మేము యేసుని పిల్లలం |2|

   రారాజు రాకడకై నిరీక్షణతో ఉన్నాం మేము నిరీక్షణతో ఉన్నాం |2| 

యేసే కావాలి నను నడిపించాలని తెలుగు సాంగ్ లిరిక్స్

యేసే కావాలి 


పల్లవి: యేసే కావాలి నను నడిపించాలని  
   ఆత్మే కావాలి నను బలపరచాలని |2|
   తండ్రే కావాలి నను ఎత్తుకోవాలని త్రిత్వంలో నేనుండాలని |2|

1. నా ఇల్లంతటిలో యజమానిగా ఉండాలి 
   ఆయన పాలనలో వర్థిల్లుతు ఉండాలి |2|
   ఏమున్న లేకున్నా సంతోశించాలి నీ చిత్తం నెరవేర్తుండాలి |2|

2. నా సేవలో బోధకుడై ఉండాలి నా మార్గంలో కాపరిగుండాలి |2|
   నీ సేవలో ఆశ్చర్యం జరగాలి నీ చిత్తం నెరవేర్తుండాలి |2|

ఆనంద యాత్రలో సాగివెళ్లేదా తెలుగు సాంగ్ లిరిక్స్

 ఆనంద యాత్రలో సాగివెళ్లేదా 


పల్లవి: ఆనంద యాత్రలో సాగివెళ్లేదా పరవశించి పాడుతూ కొనియాడేదా |2|


1. నా పాపమును కడిగిన దేవా నా శాపములు బాపిన ప్రభువా |2|

   నా అతిక్రమములు తుడిచిన దేవా స్తుతీయింతును నీ ఘన నామం |2|


2. పరిశుద్ధునిగా మార్చిన దేవా పరలోక పౌరునిగా నిలిపిన ప్రభువా |2|

   జీవ గ్రంధములో నా పేరు రాసిన యేసయ్యా నిన్నే స్తుతీయింతును |2|


ఓ సంఘమా క్రైస్తవా సంఘమా సాంగ్ తెలుగు లిరిక్స్

 ఓ సంఘమా క్రైస్తవా సంఘమా  పల్లవి : ఓ సంఘమా క్రైస్తవా సంఘమా   ప్రభు రాకకై సిద్ధపడుమా   ఓ సంఘమా క్రైస్తవా సంఘమా   ప్రభు రాకకై సిద్ధంగుండుమా ...