యేసే కావాలి
క్రైస్తవులను ఆధ్యాత్మికంగా బలపరిచే కీర్తనలు , వర్తమానాలు మరియు ఆర్టికల్స్ మీకు ఉచితంగా అందించాలనే ఉద్దేశ్యంతో మేము చేస్తున్న చిన్న ప్రయత్నం కొరకు మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండీ. మీరు దేవునిలో ఎదుగుతూ మీకు ఆశీర్వాదం కలుగుతున్న కొలది మీ స్నేహితులు మరియు మీ బంధువులకు కూడా షేర్ చేసి దేవుని పనిలో భాగస్తులు అవ్వండి. దేవుని మహా కృప మీ అందరికీ తోడైయుండును గాక! అమెన్!!
Thursday, 3 November 2022
యేసే కావాలి నను నడిపించాలని తెలుగు సాంగ్ లిరిక్స్
ఆనంద యాత్రలో సాగివెళ్లేదా తెలుగు సాంగ్ లిరిక్స్
ఆనంద యాత్రలో సాగివెళ్లేదా
పల్లవి: ఆనంద యాత్రలో సాగివెళ్లేదా పరవశించి పాడుతూ కొనియాడేదా |2|
1. నా పాపమును కడిగిన దేవా నా శాపములు బాపిన ప్రభువా |2|
నా అతిక్రమములు తుడిచిన దేవా స్తుతీయింతును నీ ఘన నామం |2|
2. పరిశుద్ధునిగా మార్చిన దేవా పరలోక పౌరునిగా నిలిపిన ప్రభువా |2|
జీవ గ్రంధములో నా పేరు రాసిన యేసయ్యా నిన్నే స్తుతీయింతును |2|
సొంతమై పోయాను యేసయ్యాకే తెలుగు సాంగ్ లిరిక్స్
సొంతమై పోయాను యేసయ్యాకే
పల్లవి: సొంతమై పోయాను యేసయ్యాకే
ప్రధానం చేయబడిన కన్యకనై |2|
1. నన్ను ప్రేమించిన ప్రియుడు ప్రాణమిచ్చాడే |2|
ప్రాణమిచ్చిన నా ప్రియుడు వస్తానన్నాడే కొనిపోతానన్నాడే |2|
2. నూతన యేరూసలేము చేరేదెన్నదో |2|
నా ప్రియుని ఒడిలో నే ఒదిగేదెన్నడో ఆ దినం ఎన్నడో |2|
ఎంత పాడిన నా ఆశ తీరదు ఏమిచ్చిన ఋణము తీరదు తెలుగు సాంగ్ లిరిక్స్
ఎంత పాడిన నా ఆశ తీరదు
పల్లవి: ఎంత పాడిన నా ఆశ తీరదు ఏమిచ్చిన ఋణము తీరదు |2|
హల్లెలూయా హల్లెలూయా |4|
1. నా శిక్ష తానే భరియించినాడే పరిశుద్ధులతో భాగమిచ్చినాడే |2|
2. నిత్యాగ్ని నుండి తప్పించినాడే పరలోక మార్గమును చూపినాడే |2|
3. నలిగిన హృదయమును చూచినాడే ఆత్మాభిషేకముతో నింపినాడే |2|
నిన్ను విడిచి నేనుండలేను నీవు లేక నే బ్రతకలేను తెలుగు సాంగ్ లిరిక్స్
నిన్ను విడిచి నేనుండలేను
పల్లవి: నిన్ను విడిచి నేనుండలేను నీవు లేక నే బ్రతకలేను |2|
యేసయ్యా నీవే కావాలి యేసయ్యా నీతో ఉండాలి |2|
1. అంధకారంలో పడియున్న నన్ను లేవనెత్తినావయ్యా |2|
తోడు నీడ లేని నాకు తోడుగా నిలిచినావయ్యా |2|
2. మరణ పడకలో పడియున్న తిరిగి జీవం ఇచ్చినావయ్యా |2|
వ్యాధి బాధలో నేనున్నా నన్ను స్వస్థపరిచినావయ్యా |2|
3. పెంట కుప్పలో పడియున్న నన్ను పైకి లేపినావయ్యా |2|
ఎన్ని కష్ట బాధలొచ్చిన నీ కొరకే జీవిస్తానయ్యా |2|
నా ఆశ జ్యోతి నీవే యేసయ్యా నా ఆశ తీర్చుమయ్యా తెలుగు సాంగ్ లిరిక్స్
నా ఆశ జ్యోతి నీవే యేసయ్యా
పల్లవి: నా ఆశ జ్యోతి నీవే యేసయ్యా నా ఆశ తీర్చుమయ్యా |2|
తీర్చుమయ్యా తీర్చుమయ్యా నా ఆశ తీర్చుమయ్యా |2|
1. ఆదిలో ఉన్న సంఘముగా ఈ సంఘం ఉండాలయ్యా |2|
చెదిరిపోనీ విశ్వాసముతో క్రీస్తు ప్రేమలో నిలుచునట్ట్లు |2|
2. ఏక మనస్సు కలిగిన ఆత్మలనిమ్మయ్యా |2|
ప్రతి దినం నీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించునట్లు |2|
3. అంతం వరకు సహియించే విశ్వసమిమ్మయ్యా |2|
జీవమైన మరణమైన నీదు సాక్షిగా నిలుచునట్లు |2|
శ్రీమంతుడా నా యేసయ్యా నీ కృప చాలునయ్యా తెలుగు సాంగ్ లిరిక్స్
శ్రీమంతుడు నా యేసయ్యా
పల్లవి: శ్రీమంతుడా నా యేసయ్యా నీ కృప చాలునయ్యా |2|
బలవంతుడా నా యేసయ్యా నీవుంటే చాలునయ్యా |2|
1. క్రుంగిన సమయములో నీ కృపను నే కోరితి |2|
కృప చూపిన నను లేపిన యేసయ్యా స్తోత్రమయ్యా |2|
2. బలహీన సమయములో నీ బలము నే కోరితి |2|
బలపరిచిన బలమిచ్చిన యేసయ్యా స్తోత్రమయ్యా |2|
3. ఒంటరి సమయములో నీ తోడు నే కోరితి |2|
తోడు నడిచిన త్రోవ చూపిన యేసయ్యా స్తోత్రమయ్యా |2|
ఓ సంఘమా క్రైస్తవా సంఘమా సాంగ్ తెలుగు లిరిక్స్
ఓ సంఘమా క్రైస్తవా సంఘమా పల్లవి : ఓ సంఘమా క్రైస్తవా సంఘమా ప్రభు రాకకై సిద్ధపడుమా ఓ సంఘమా క్రైస్తవా సంఘమా ప్రభు రాకకై సిద్ధంగుండుమా ...
-
ఓ సంఘమా క్రైస్తవా సంఘమా పల్లవి : ఓ సంఘమా క్రైస్తవా సంఘమా ప్రభు రాకకై సిద్ధపడుమా ఓ సంఘమా క్రైస్తవా సంఘమా ప్రభు రాకకై సిద్ధంగుండుమా ...
-
నిన్ను విడిచి నేనుండలేను పల్లవి: నిన్ను విడిచి నేనుండలేను నీవు లేక నే బ్రతకలేను |2| యేసయ్యా నీవే కావాలి యేసయ్యా నీతో ఉండాలి |2| 1. అంధ...
-
ఆనంద యాత్రలో సాగివెళ్లేదా పల్లవి: ఆనంద యాత్రలో సాగివెళ్లేదా పరవశించి పాడుతూ కొనియాడేదా |2| 1. నా పాపమును కడిగిన దేవా నా శాపములు బాపిన ప్ర...